TS EAPCET: అలర్ట్.. టీఎస్ ఈఏపీ‌సెట్‌ దరఖాస్తుల సమర్పణకు రేపే చివరి తేదీ

  • ఫిబ్రవరి 26న మొదలైన దరఖాస్తుల స్వీకరణ
  • ఏప్రిల్ 6తో ముగియనున్న వైనం
  • లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఒక్క రోజే అవకాశం
  • ఇప్పటివరకూ 3,21,604 దరఖాస్తులు వచ్చాయన్న జేఎన్టీయూహెచ్
Tomorrow is the last date for applying for TS EAPCET

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీ‌సెట్‌కు రేపే చివరి రోజు. ఫిబ్రవరి 26న మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 6తో ముగియనుంది. లేట్ ఫీజు లేకుండా దరఖాస్తు సమర్పించేందుకు మరో రోజే మిగిలి ఉంది. 

ఇప్పటివరకూ టీఎస్ ఈఏపీ‌సెట్‌కు భారీగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,33,517 మంది, అగ్రికల్చర్‌ / ఫార్మా విభాగాల్లో 87,819 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం టీఎస్ ఈఏపీసెట్‌కు 3,21,604 దరఖాస్తులు వచ్చాయని జేఎన్టీయూహెచ్ వెల్లడించింది. ఈసారి గడువు తేదీ ముగియకముందే గతేడాదితో పోలిస్తే అత్యధిక దరఖాస్తులు అందాయని సమాచారం. 

ఈఏపీసెట్ పరీక్షను మే 7 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 9,10,11 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి.

More Telugu News