BRS: తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు?

  • అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్
  • ఇతర పార్టీలలోకి వరుస కడుతున్న నేతలు
  • ఇందుకు వాస్తుదోషం కారణమని భావిస్తున్న నాయకులు
  • ఈ నేపథ్యంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయం
Vasthu changes for telangana bhavan

హైదరాబాదులోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వరుసగా నేతలు ఇతర పార్టీలలోకి క్యూ కడుతున్నారు. ఇందుకు వాస్తుదోషం కారణమని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యంగా కార్యాలయంలోకి వెళ్లే గేటు.. తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా, వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలుసాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇక నుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధిపోటు కారణంగా లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని గేటుకు ఏర్పాటు చేశారు. మరోవైపు, రాకపోకలను మార్చడానికి ట్రాఫిక్ సమస్య కూడా కారణమని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News