Chandrababu: శవాన్ని చూస్తే అందరూ బాధపడతారు... జగన్ కు మాత్రం శవాన్ని చూస్తే నవ్వొస్తుంది: చంద్రబాబు

Chandrababu satires on CM Jagan
  • గోపాలపురంలో ప్రజాగళం సభ
  • సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శనాస్త్రాలు
  • వైఎస్ తనకు పాత మిత్రుడన్న టీడీపీ అధినేత  
  • వైఎస్ చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డానని వెల్లడి

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం బాగా అలవాటు అని వ్యాఖ్యానించారు. 

ఎప్పుడైనా గమనించండి... శవాన్ని చూడగానే నవ్వుతాడు... ఎవరైనా శవాన్ని చూస్తే నవ్వుతారా? శవాన్ని చూస్తే ఎవరైనా బాధపడతాం అని వివరించారు. 

"వీళ్ల నాన్న రాజశేఖర్ రెడ్డి నా పాత మిత్రుడు. ఆయన చనిపోతే ఎంతో బాధపడ్డాను. అప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. చూడ్డానికి నేను కూడా వెళ్లాను. వైఎస్ ను అలా చూసి ఎంతో బాధపడ్డాను... ఆ సమయంలో జగన్ మాత్రం ఎంతో బిజీగా కనిపించాడు. ముఖ్యమంత్రి అయిపోవడానికి సంతకాల ఉద్యమం చేపట్టాడు. ఆయన ప్రయత్నం ఫలించలేదు. నీకు అర్హత లేదు, నీలాంటి వాడికి సీఎం పదవి ఇస్తే రాష్ట్రం ఏమవుతుందో అంటూ ఆ రోజు సోనియా గాంధీ తిరస్కరించారు" అని చంద్రబాబు వివరించారు. 

"నాడు బాబాయ్ ని చంపి నారాసుర రక్తచరిత్ర అని సొంత మీడియాలో వేసుకున్నారు. చెల్లిని మోసం చేశాడు. ఇప్పుడా చెల్లిపైనే కేసులు పెట్టారు. హత్య చేసిన వాడ్ని పక్కన పెట్టుకుని ఇది కలియుగం అని మాట్లాడుతున్నాడు. అవినాశ్ రెడ్డి చంపాడా, లేదా? సీబీఐ కేసు పెట్టిందా, లేదా? సీబీఐ కేసు పెట్టాక ఈయన కాపాడాడా, లేదా? ఏంటి... అంత ప్రేమ నీకెందుకు? హత్య చేసిన వ్యక్తిని కాపాడడం నేరమా, కాదా? ఫ్యాన్ ఎలాగూ తిరగడంలేదు కాబట్టి, ఎన్నికల సంఘం కూడా జగన్ పార్టీకి గొడ్డలి గుర్తును ఖాయం చేస్తే శని వదిలిపోతుంది" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News