Fake notes: హైదరాబాద్ లో వాహన తనిఖీలో పట్టుబడ్డ నకిలీ నోట్లు

Police Seize Rs 25 Lakh Duplicate Notes
  • రూ.25 లక్షల విలువైన నోట్ల గుర్తింపు
  • నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
  • మహారాష్ట్ర నుంచి నగరానికి తీసుకొచ్చిన నిందితులు
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నోట్ల పంపిణీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారితో పాటు హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఓ వాహనంలో పెద్ద మొత్తంలో నోట్లకట్టలు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఆ నోట్లను పరీక్షించగా అవి నకిలీ నోట్లని తేలింది. వాటి విలువ సుమారు 25 లక్షలకు పైనే ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో ఆ వాహనం డ్రైవర్ తోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో వారంతా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లు తేలిందని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) మహేశ్వరం పోలీసులు తెలిపారు.
Fake notes
25 lakh fake notes
balapur
police check
SOT Police

More Telugu News