Jaipur: కూర‌గాయ‌ల‌మ్మే వ్య‌క్తిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపిన పోలీస్‌ అధికారి కొడుకు!

 Police Inspector Son Beats Man to Death With Cricket Bat in Broad Daylight in Jaipur
  • రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో ఘ‌ట‌న‌
  • త‌మ ఇంటి ఎదురుగా కూర‌గాయ‌ల షాపు పెట్టడం న‌చ్చ‌క దారుణానికి పాలడ్డ పోలీస్ అధికారి కుమారుడు   
  • సీసీటీవీలో రికార్డు అయిన ఘ‌ట‌న తాలూకు దృశ్యాలు
  • వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో ఓ పోలీసు అధికారి కొడుకు దారుణానికి ఒడిగ‌ట్టాడు. కూర‌గాయ‌ల‌మ్మే మోహ‌న్ అనే వ్య‌క్తిని క్రికెట్ బ్యాటుతో కొట్టి చంపేశాడు. నిందితుడు క్షితిజ్ ఇంటికి ఎదురుగా మోహ‌న్ కూర‌గాయ‌ల షాపు పెట్టాడు. అది న‌చ్చ‌ని క్షితిజ్ ఇంత‌టి దారుణానికి పాల్ప‌డ్డాడు. స్థానిక ర‌జ‌నీ విహార్ కాల‌నీలో మంగ‌ళ‌వారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. క్షితిజ్ ఇంట్లోంచి బ్యాటు తీసుకుని వెళ్లి, మోహ‌న్ త‌ల‌పై బాద‌డంతో అత‌డు అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలాడు. అలా కింద‌ప‌డిన మోహ‌న్‌పై క్షితిజ్ మ‌ళ్లీ బ్యాటుతో కొట్ట‌డం వీడియోలో ఉంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అవి కాస్తా బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. వీడియోలోని దృశ్యాల ఆధారంగా నిందితుడు క్షితిజ్‌ను పోలీసులు బుధ‌వారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, క్షితిజ్ తండ్రి భ‌జ‌న్‌లాల్ సీఎంఓలో విధులు నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.
Jaipur
Police Inspector
Cricket Bat
Rajasthan
Crime News

More Telugu News