Leopard Attack: సాహసమంటే ఇదీ.. ఉత్త చేతులతో చిరుతను ఎదుర్కొన్న అటవీశాఖ ఉద్యోగి.. వీడియో ఇదిగో!

Wildlife Official Fights Off Leopard With Stick In Kashmir Village
  • కశ్మీర్ లోని ఓ గ్రామంలో చిరుత సంచారం
  • ఇద్దరు మహిళలను గాయపరిచిన చిరుతపులి
  • భయాందోళనలతో అధికారులకు సమాచారం అందించిన గ్రామస్థులు
  • చిరుతను బంధించే క్రమంలో గాయపడ్డ ముగ్గురు ఉద్యోగులు
కశ్మీర్ లోని గాందర్బల్ జిల్లాలోని ఫతేపోరా గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. బుధవారం ఓ చిరుత గ్రామంలోకి ప్రవేశించి జనాలను భయాందోళనలకు గురిచేసింది. ఇద్దరు మహిళలపై దాడి చేసి గాయపరిచింది. అదృష్టవశాత్తూ ఆ మహిళలు తప్పించుకున్నారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చిరుతను బంధించేందుకు ప్రయత్నించగా ముగ్గురు సిబ్బందిని గాయపరిచింది. చిరుతను ప్రాణాలతో పట్టి తీసుకెళ్లేందుకు ఓ ఉద్యోగి సాహసించి ఖాళీ చేతులతోనే దానితో తలబడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 
గ్రామస్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. బుధవారం గ్రామంలోకి ఓ చిరుత వచ్చింది. వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్న చిరుతను చూసి భయాందోళనలకు గురైన జనం వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు గ్రామానికి చేరుకునేలోగా ఆ చిరుత ఇద్దరు మహిళలపై దాడి చేసి గాయపరిచింది. చిరుతను బంధించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నించగా.. ఓ ఉద్యోగి చేతిని చిరుత నోటకరిచింది. ఓవైపు చిరుత నోట్లో తన చేతిని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తూనే దానిని బంధించేందుకు ఆ ఉద్యోగి ప్రయత్నించాడు.

ఇంతలో మిగతా సిబ్బంది, గ్రామస్థులు కలిసి కట్టెలతో చిరుతను కొట్టడంతో చేతిని విడిచిపెట్టింది. ఆ తర్వాత చిరుతకు మత్తుమందు ఇచ్చి బంధించారు. చిరుత దాడిలో గాయపడ్డ అటవీశాఖ సిబ్బందితో పాటు గ్రామస్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారన్నారు.
Leopard Attack
Kashmir Village
wildlife staff
fight with leopard
Viral Videos

More Telugu News