Pawan Kalyan: సామాన్యుడి ఇంటికి పవన్ కల్యాణ్ వెళితే ఎలా ఉంటుందో.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది!
- పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్
- నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం
- ఇంటింటికీ తిరుగుతూ మద్దతు కోరుతున్న వైనం
జనసేన పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, అన్ని వర్గాల వారికి దగ్గరవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ మధ్యాహ్నం పొన్నాడ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి, అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఓ సామాన్యుడి ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లగా, అక్కడ నెలకొన్న కోలాహలం మామూలుగా లేదు. పవన్ కల్యాణ్ అంతటివాడు తమ ఇంటికి రావడంతో, ఆ కుటుంబానికి చెందినవారు ఉబ్బితబ్బిబ్బయిపోయారు.
సాధారణ వ్యక్తిలా నవ్వారు. మంచంపై కూర్చున్న పవన్ కల్యాణ్, ఆ ఇంటివారితో మాట్లాడారు. వారు కూడా పవన్ ను తమ సొంత మనిషిలా భావించి కష్టనష్టాలు చెప్పుకున్నారు. ఇదిలావుంటే, పవన్ ను చూసేందుకు వచ్చిన వారితో అక్కడ సందడి మిన్నంటింది. అరుపులు, కేకలు, నినాదాలతో హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని విడుదల చేసింది.
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్... ఈసారి పిఠాపురం నుంచి చావోరేవో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ తాను పోటీ చేసేందుకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన పిఠాపురంలోనే మకాం వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
పిఠాపురంలో పవన్ కు పోటీగా వైసీపీ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. వంగా గీత కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారంలో ముందుకు పోతున్నారు.

పిఠాపురం నియోజకవర్గం పొన్నాడ గ్రామంలో ఇంటింటికీ వెళ్లి వాళ్ళను పలకరించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan #VarahiVijayaBheri #Pithapuram pic.twitter.com/4z81VSiYTm
— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 2, 2024