AP Women dead in USA: పోర్ట్ ల్యాండ్ ప్రమాదంలో గాయపడ్డ ఏపీ మహిళ మృతి

AP women Hospitalized after accident in America died today
  • ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం
  • స్పాట్ లోనే మరణించిన చిన్నారి, కోమాలోకి తల్లి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించిందని వైద్యుల ప్రకటన
అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎపీలోని కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి(32) మృతి చెందింది. ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన గీతాంజలి సోమవారం రాత్రి మరణించారు. కూతురు పుట్టిన రోజు సందర్భంగా భర్త, కొడుకుతో కలిసి గుడికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. పోర్ట్ ల్యాండ్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి హానిక అక్కడికక్కడే చనిపోయింది. 

ఈ ప్రమాదంలో గీతాంజలి, ఆమె భర్త కమతం నరేశ్, కొడుకు బ్రమణ్ కు గాయాలయ్యాయి. తీవ్ర గాయాల కారణంగా గీతాంజలి కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొణకంచికి చెందిన నరేశ్, గీతాంజలి దంపతులు అమెరికాలో స్థిరపడ్డారు. దంపతులు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నారని కొణకంచిలోని వారి బంధువులు తెలిపారు. కాగా, ప్రస్తుతం నరేశ్, బ్రమణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు. గీతాంజలి, హానిక మృతదేహాలను స్వగ్రామం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.
AP Women dead in USA
Portland Accident
Konakanchi
coma

More Telugu News