Trent Boult: వాంఖడేలో రికార్డులకెక్కిన రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్

Trent Boult creates another record in his name
  • ముంబైతో మ్యాచ్‌లో వరుసగా రోహిత్, నమన్‌ధీర్‌ను వెనక్కి పంపిన బౌల్ట్
  • తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన భువీ సరసన చోటు
  • మొదటి ఓవర్‌లో ఐదుసార్లు రెండు వికెట్లు తీసిన ఘనత

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అరుదైన రికార్డు సాధించాడు. నిన్నటి మ్యాచ్‌లో తొలి ఓవర్ చివరి రెండు బంతుల్లో రోహిత్‌శర్మ,  నమన్‌ధీర్‌లను వెనక్కి పంపిన బౌల్ట్.. తొలి ఓవర్‌లో అత్యధిక వికెట్లు నేలకూల్చిన బౌలర్ల జాబితాలో భువనేశ్వర్‌కుమార్ సరసన చేరాడు. 

తొలి ఓవర్‌లో ఇద్దరూ చెరో 25 వికెట్లు తీసుకుని సంయుక్తంగా తొలిస్థానంలో కొనసాగుతున్నారు. భువీ 116 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధిస్తే, బౌల్ట్ 80 ఇన్నింగ్స్‌లలోనే 25 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది. తొలి ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టడం బౌల్ట్‌కు ఇది ఐదోసారి. గతంలో డేల్ స్టెయిన్, ప్రవీణ్‌కుమార్, ఉమేశ్‌యాదవ్ ఈ ఘనత సాధించారు.

  • Loading...

More Telugu News