Dharmana Prasada Rao: ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే బాబుకే అంటున్నారు.. మంత్రి ధర్మాన ఆవేదన

AP minister Dharmana Prasad says people not know YCP symbol
  • శ్రీకాకుళం నగర పరిధిలో పలు ప్రాంతాల్లో పేరాడ తిలక్‌తో కలిసి ధర్మాన ప్రచారం
  • మన గుర్తు ఏంటి అని అడిగితే సైకిల్, హస్తం అంటున్నారన్న మంత్రి
  • చాలామందికి పార్టీ గుర్తు తెలియడం లేదని ఆవేదన
వైసీపీ గుర్తు ఏంటో ఇప్పటికీ చాలామందికి తెలియదని, ప్రచారానికి వెళ్లినప్పుడు ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగితే హస్తం అని, సైకిల్ అని అంటున్నారని ఏపీ రెవెన్యూమంత్రి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగర పరిధిలోని బలగ, శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలస పంచాయతీ బెండవానిపేటలో నిన్న వైసీపీ శ్రీకాకుళం లోక్‌సభ అభ్యర్థి పేరాడ తిలక్‌తో ఆయన ఎన్నిక ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యుద్ధానికి సిద్ధమవుతున్న ప్రస్తుతం తరుణంలో ఇప్పటికీ చాలామందికి పార్టీ గుర్తు ఏంటో తెలియదని పేర్కొన్నారు. ఏ పార్టీకి ఓటేస్తారని అడిగితే చాలామంది బాబుకే వేస్తామని సమాధానం చెబుతున్నారని పేర్కొన్నారు. ఏ బాబుకు ఓటేస్తారని మళ్లీ అడిగితే హస్తం, సైకిల్ అంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే విశాఖను రాజధాని చేస్తామని ధర్మాన పేర్కొన్నారు.
Dharmana Prasada Rao
Srikakulam District
YSRCP
Andhra News
Perada Tilak

More Telugu News