Mallu Bhatti Vikramarka: మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలని అబద్ధాలు చెప్పడమా?: కేసీఆర్‌పై మల్లు భట్టివిక్రమార్క ఆగ్రహం

  • బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారన్న భట్టివిక్రమార్క
  • కేసీఆర్ కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శ
  • కేసీఆర్ తాను కట్టిన ఇంటిని తానే తగులబెట్టి పోయారన్న ఉపముఖ్యమంత్రి
  • కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేశారని వ్యాఖ్య
Mallu Bhattivikramarka fires at kcr

పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇంతలా అబద్ధాలు చెబుతారా? ఇలా దిగజారుతారా? ఆయన మాట్లాడుతుంటే మైక్ సమస్య వస్తే కరెంట్ కోతలని అబద్ధాలు మాట్లాడారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాటల్లో కొంచెం కూడా వాస్తవం లేదన్నారు. కట్టు కథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్ తాను కట్టిన ఇంటిని తానే తగులబెట్టి పోయారని విమర్శించారు. కేసీఆర్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అప్పులు చేశారని ఆరోపించారు. 

బొగ్గు లభించే ప్రాంతానికి 350 కిలో మీటర్ల దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఉందని, దూరంగా ఉండటం వల్ల థర్మల్ పవర్ ప్లాంటుకు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చవుతోందన్నారు. అలాగే పర్యావరణ అనుమతులు పొందడంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందన్నారు. తెలంగాణకు 4వేల కోట్ల మెగా వాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజన చట్టంలో ఉందని పేర్కొన్నారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాల్సి ఉందని... కానీ కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ప్లాంట్‌ను చేపట్టారన్నారు.

  • Loading...

More Telugu News