Ayesha Khan: ఎవరీ అయేషా ఖాన్ .. ఎక్కడ చూసినా ఆమె నామస్మరణే!

  • 'ముఖచిత్రం'తో పరిచయమైన అయేషా ఖాన్ 
  • విడుదల కావలసి ఉన్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'
  • 'ఓం భీమ్ బుష్'తో అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ
  • ఆమె గ్లామర్ కి ఫిదా అవుతున్న కుర్రకారు  
  • త్వరలో ఈ సుందరి మరింత బిజీ అయ్యే అవకాశం

Ayesha Khan Special

'వెయ్యినొక్క జిల్లాల వరకూ వింటున్నాము నీ కీర్తనే .. ముల్లోకాల ఏ మూల విన్నా నీ అందాల సంకీర్తనే' అంటూ సిరివెన్నెల చాలాకాలం క్రితమే పదప్రయోగాల పండగ చేశారు. ఇప్పుడు కుర్రాళ్లంతా కూడా ఈ లైన్లు వెతికి మరీ పట్టుకుంటున్నారు.. పాడుకుంటున్నారు. మళ్లీ ఇంతకాలానికి ఈ పాటకి పని కల్పించిన ఆ బ్యూటీ ఎవరంటే .. అయేషా ఖాన్. ఇంతకాలం ఈ సుందరి ఏమైపోయిందనేది అందరూ అందరినీ అడుగుతున్న ప్రశ్న. ఒక సినిమాలో ఒక హీరోయిన్ అందంగా కనిపిస్తే, హీరోయిన్ బాగుంది .. కొన్నాళ్లపాటు ఆమె హవా కొనసాగడం ఖాయమని అనుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇంతటి అందగత్తె ఒక చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇస్తే .. ఆశ్చర్యపోని ఆడియన్స్ ఉండరు. హీరోయిన్ గ్లామర్ ను బీట్ చేసే అప్సరసలాంటి ఆ సుందరి గురించి థియేటర్ బయటికి వచ్చిన తరువాత కూడా మాట్లాడుకొని వారంటూ ఉండరు. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు అయేషా ఖాన్ విషయంలో జరిగింది. ఈ అజంతా శిల్పం కొంతకాలం క్రితమే 'ముఖచిత్రం' సినిమా ద్వారా పరిచయమైంది. ఆ సినిమాలో ఆమె పాత్ర పెద్దగా కనెక్ట్ కాకపోవడం వలన ఆడియన్స్ పట్టించుకోలేదు. ఆమె చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విడుదల కాకపోవడం వలన, ఆమె కురాళ్ల కళ్లలో పడలేదు. 'ఓం భీమ్ బుష్'లో చిన్న పాత్రలో ఆమె కనిపించిన దగ్గర నుంచి పడుచు పల్స్ రేట్ పెరిగిపోయింది. వాళ్లంతా ఆమెను గురించి ఒక రేంజ్ లో సెర్చ్ చేస్తున్నారట. ఆమె కాస్త సన్నబడి హీరోయిన్స్ కి పోటీ ఇస్తుందో .. ఇలాగే కనిపిస్తూ స్పెషల్ సాంగ్స్ లో సందడి చేస్తుందో చూడాలి మరి. ఎలాగైనా సరే ఆమె తెరపై కనిపిస్తే చాలనేదే ఇప్పుడు కుర్రాళ్లు చేస్తున్న పెద్ద డిమాండ్. 


More Telugu News