Pawan Kalyan: జనసేన అధినేతకు స్వల్ప అస్వస్థత

Pawan kalyan participites in election campaign despite being unwell
  • రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్న పవన్ 
  • అయినా శనివారం ప్రచారంలో పాల్గొన్న వైనం
  • షెడ్యూల్ ముందస్తుగా ఖరారు కావడంతో అనారోగ్యంతోనే ప్రచారం కొనసాగింపు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. అయితే, ప్రచారం మాత్రం యథావిథిగా కొనసాగించారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న పవన్ కల్యాణ్ వారాహి విజయభేరి షెడ్యూల్ ముందస్తుగానే ఖరారయ్యింది. దీంతో, ప్రచారం వాయిదా వేయడం ఇష్టం లేక ఆయన ప్రచారానికి హాజరయ్యారు. ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం పొందుతూనే శనివారం ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. 

ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన-టీడీపీ-బీజేపీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. శ్రేణులకు పలు సూచనలు చేశారు. అత్యవసర సమావేశం కోసం ఆదివారం సాయంత్రం హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ కు వెళ్లిన పవన్ కల్యాణ్, సోమవారం ఉదయం మళ్లీ పిఠాపురం చేరుకుని మిగిలిన పర్యటన పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Pawan Kalyan
Peethapuram
Janasena
Andhra Pradesh

More Telugu News