SRH: టైటాన్స్ తో సమరానికి సన్ రైజర్స్ సై... టాస్ అప్ డేట్ ఇదిగో!

SRH takes on Gujarat Titans in Ahmedabad
  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మ్యాచ్

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ జట్టు  ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతుంది. అటు, గుజరాత్ టైటాన్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో నూర్ అహ్మద్, సాయి కిశోర్ స్థానంలో దర్శన్ నల్కండే ఆడుతున్నారు. 

ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

సన్ రైజర్స్ హైదరాబాద్: ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, జయదేవ్ ఉనద్కట్.

గుజరాత్ టైటాన్స్: శుభ్ మాన్ గిల్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్.

  • Loading...

More Telugu News