Krishna Express: ఆలేరు వద్ద కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

Krishan Express Missed Major Accident At Alair Station
  • ఆలేరు స్టేషన్ దాటుతుండగా పెద్ద శబ్దం
  • గమనించి రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేసిన ప్రయాణికులు
  • పట్టా విరిగినట్టు గుర్తించి మరమ్మతులు చేసిన సిబ్బంది

ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్ దాటుతున్న సమయంలో భారీశబ్దం వినిపించింది. దీంతో హడలిపోయిన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. 

అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. అనంతరం పట్టాలను పరిశీలించగా రైలు పట్టా విరిగినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం రైలు బయలుదేరింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News