IPL 2024: రింకూ సింగ్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ

Virat Kohli Gifted Bat to Rinku Singh after KKR Vs RCB Match in Bengaluru
  • నిన్న‌టి మ్యాచ్ అనంత‌రం కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన కింగ్ కోహ్లీ
  • యువ ఆట‌గాళ్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసిన విరాట్‌
  • ఈ విష‌యాన్ని ఇన్‌స్టా వేదిక‌గా తెలియ‌జేసిన రింకూ సింగ్‌

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో శుక్ర‌వారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఓట‌మి చ‌విచూసిన విష‌యం తెలిసిందే. విరాట్ కోహ్లీ 83 ప‌రుగుల‌తో విజృంభించినప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది. ఆర్‌సీబీపై కేకేఆర్ సునాయాసంగా గెలిచేసింది. ఇక మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కింగ్ కోహ్లీ కేకేఆర్ ఆట‌గాళ్ల‌ను వారి డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి క‌లిశాడు. ఈ సంద‌ర్భంగా ఆ జ‌ట్టులోని రింకూ సింగ్‌తో పాటు ప‌లువురు ఇతర యువ‌ ఆట‌గాళ్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశాడు.

అలా వారితో కొద్దిసేపు విరాట్ స‌ర‌దాగా గ‌డిపాడు. ఈ క్ర‌మంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో దిగిన ఫొటోల‌ను రింకూ సింగ్ త‌న ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. త‌న‌కు ప‌లు కీల‌క సూచ‌న‌లు చేయ‌డంతో పాటు స్పెష‌ల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కోహ్లీకి రింకూ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. 'థ్యాంక్యూ ఫ‌ర్ అడ్వైజ్ భ‌య్యా.. అలాగే బ్యాట్ ఇచ్చినందుకు కూడా ధ‌న్య‌వాదాలు' అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ విష‌యం తెలుసుకున్న‌ నెటిజ‌న్లు.. యువ ఆట‌గాళ్ల‌ను ప్రోత్సహించ‌డంలో కింగ్ కోహ్లీ ఎప్పుడు ముందుంటాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News