KCR: రేపు 3 జిల్లాల్లో కేసీఆర్ పర్యటన, రైతులతో సమావేశం

KCR to visit some Telangana districts meet farmers on March 31
  • జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్ పర్యటన
  • నీళ్లు లేక ఎండిపోతున్న పొలాల పరిశీలన
  • అనంతరం, బాధిత రైతులతో సమావేశం
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం, బాధిత రైతులతో సమావేశమవుతారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఆయన పర్యటిస్తారు. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

అంతకుమునుపు, మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పొలాల పరిస్థితిని పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో చూస్తున్న నీటి కొరతకు ప్రకృతి కారణం కాదని, పాలక పక్షమే కారణమని మండిపడ్డారు. 
KCR
BRS
Jangaon District
Nalgonda District
Suryapet District

More Telugu News