GHMC: రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను: జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి

GHMC Mayor will join congress tomorrow
  • రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న విజయలక్ష్మి
  • కాంగ్రెస్‌లో చేరిన నిజామాబాద్ తొలి మహిళా మేయర్ ఆకుల సుజాత
  • షబ్బీర్ అలీ సమక్షంలో పార్టీలో చేరిక

తాను రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో తాను కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నానని తెలిపారు. తెలంగాణలో ఇటీవల పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు తండ్రి కే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలోకి నిజామాబాద్ తొలి మహిళా మేయర్

నిజామాబాద్ నగర తొలి మేయర్ ఆకుల సుజాత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరఫున మేయర్‌గా తొలిసారి ఆకుల సుజాత 2014 నుంచి 2018 వరకు పని చేశారు. ఈరోజు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకున్నారు.

  • Loading...

More Telugu News