Pitani Blakrishna: జనసేనకు షాక్.. జగన్ సమక్షంలో రేపు వైసీపీలో చేరనున్న పితాని బాలకృష్ణ

Janasena leader Pithani Balakrishna joining YSRCP
  • గత ఎన్నికల సమయంలో వైసీపీని వీడి జనసేనలో చేరిన పితాని
  • జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన పితాని
  • ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వెళ్తున్న వైనం

ఎన్నికలకు సమయం సమీస్తున్న తరుణంలో జనసేనకు మరో షాక్ తగిలింది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ఉన్న పితాని బాలకృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన రేపు వైసీపీలో చేరుతున్నారు. 

పితాని గతంలో వైసీపీలోనే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు ఆయన ముమ్మిడివరం వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్నారు. అయితే 2019లో పితానికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో అప్పట్లో ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు. కానీ, ఆ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పితాని ఓడిపోయారు. ఇప్పుడు జనసేన టికెట్ నిరాకరించడంతో మళ్లీ వైసీపీలో చేరబోతున్నారు. జనసేనపై ఆయన ఇప్పటికే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పవన్ తనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. పొత్తులో భాగంగా ముమ్మిడివరం టీడీపీకి వెళ్లింది. దీంతో, రామచంద్రాపురం సీటుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. అక్కడ కూడా టికెట్ దక్కక పోవడంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News