Chilakaluripet: టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ మాజీ ఇన్‌ఛార్జి రాజేశ్‌ నాయుడు, పలువురు నేతలు

YSRCP leaders of Chilakaluripet joins TDP
  • నారా లోకేశ్ సమక్షంలో భారీ చేరికలు
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ శ్రీను
  • కొత్త చేరికలతో టీడీపీలో జోష్
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో చిలకలూరిపేట వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. చిలకలూరిపేట నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జీ రాజేశ్ నాయుడు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోల్డ్ శ్రీను టీడీపీలో చేరారు. వీరితో పాటు మరో 10 మంది వైసీపీ కౌన్సిలర్లు, జడ్పీటీసీ సభ్యుడు, ఇద్దరు సర్పంచ్ లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ సమక్షంలో వీరు టీడీపీలో చేరారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి లోకేశ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్ నాయుడు మాట్లాడుతూ మంత్రి విడదల రజనీకి రూ. 6 కోట్లు ఇచ్చి మోసపోయానని చెప్పారు. శ్రీను మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇస్తామని రూ. 2.5 కోట్లు తీసుకున్నారని మండిపడ్డారు.  
Chilakaluripet
Telugudesam
YSRCP

More Telugu News