బ్రా ధరించలేదని విమానం నుంచి దించేస్తామన్నారు.. డెల్టా ఎయిర్‌లైన్స్‌పై విరుచుకుపడిన మహిళ
- జనవరిలో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి
- సాల్ట్‌లేక్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తుండగా ఘటన
- టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామన్న విమాన సిబ్బంది
- తన ఎద యుద్ధంలో వాడే ఆయుధం కాదన్న బాధిత మహిళ
- ఎయిర్‌లైన్ సంస్థకు నోటీసులు
- ఇప్పటికే క్షమాపణలు చెప్పిన డెల్టా ఎయిర్‌లైన్స్
డీజే అయిన ఆర్చ్‌బోల్డ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన వస్త్రధారణ ‘బహిర్గతం’, ‘ఆక్షేపణీయం’గా ఉందని, కాబట్టి అనుమతించబోమని డెల్టా సిబ్బంది తనకు చెప్పారని వివరించారు. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారని తెలిపారు. ఈ వివక్షాపూరిత విధానంపై చర్చించేందుకు కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం కావాలని డిమాండ్ చేస్తూ ఆర్చ్‌బోల్డ్ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాసినట్టు న్యాయవాది గ్లోరియా ఆల్రెడ్ తెలిపారు.
పురుషులు తమ టీ షర్టులను జాకెట్లతో ఎలా అయితే కప్పుకోరో, మహిళలకు కూడా అలాంటి అవసరం లేదని ఆమె వాదించారు. భద్రతాపరమైన ముప్పు ఉంటే తప్ప ప్రయాణికులను విమానం నుంచి దించకూడదని అమెరికా చట్టాలు చెబుతున్నాయని ఆల్రెడ్ తెలిపారు. రొమ్ములు యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కావని, వారు అవి కలిగి ఉండడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పినట్టు తెలిసింది.