Bengaluru: మర్మాంగంలోకి ఎయిర్‌ బ్లోయర్ దూర్చడంతో పేగులు ఉబ్బి యువకుడి మృతి

Bengaluru Man Dies After Friend Pumps Hot Air Into His Rectum For Fun
  • బెంగళూరులో మార్చి 25న ఘటన
  • స్నేహితుడికి బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చిన నిందితుడు
  • సర్వీసింగ్ తరువాత ఇద్దరూ ఎయిర్ బ్లోయర్‌తో ఆటలు
  • స్నేహితుడి మర్మాంగంలోకి బ్లోయర్ చొప్పించడంతో కడుపుబ్బి బాధితుడి మృతి

ఎయిర్ బ్లోయర్‌తో ఆటలు ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్న ఘటన బెంగళూరులో తాజాగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్ (24), మార్చి 25న స్థానిక వాషింగ్ సెంటర్‌లో పని చేస్తున్న తన స్నేహితుడు మురళి వద్దకు వెళ్లాడు. సర్వీసింగ్ కోసం తన బైక్‌ను అతడికి ఇచ్చాడు. ఆ తరువాత.. బండిపై నీటిని తొలగించే హాట్ ఎయిర్ బ్లోయర్‌తో ఇద్దరూ ఆటలు ప్రారంభించారు. 

తొలుత మురళి ఎయిర్ బ్లోయర్‌తో యోగేశ్ ముఖంపై గాలి కొట్టాడు. ఆ తరువాత అతడి మర్మాంగంలోకి బ్లోయర్ నాజిల్‌ను చొప్పించి ఆన్ చేశాడు. దీంతో, యోగేశ్ కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయి అతడు కూలబడిపోయాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. చివరకు అతడి ఆరోగ్యం మరింతగా విషమించి మృతి చెందాడు. కాగా, నిందితుడు మురళిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News