Allu Arjun: ఇవాళ నాకు చాలా ప్రత్యేకమైన రోజు: అల్లు అర్జున్

Allu Arjun stated that this day is very special for him
  • దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ లో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
  • ఇవాళ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నానన్న బన్నీ
  • సరిగ్గా ఇదే రోజు 2003లో గంగోత్రి విడుదలైందని వెల్లడి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరణకు సిద్ధమైంది. దీనిపై అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఇవాళ తనకెంతో ప్రత్యేకమైన రోజు అని తెలిపారు. 

"నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో సరిగ్గా ఈ రోజే విడుదలైంది. ఇవాళ దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాను. ఈ 21 ఏళ్ల నా సినీ ప్రస్థానం మర్చిపోలేనిది. ఈ నా ప్రయాణంలో ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా, నాపై అపారమైన ప్రేమాభిమానాలు కురిపిస్తూ, ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే అభిమానులకు కృతజ్ఞతలు. రాబోయే సంవత్సరాల్లో మీరు మరింత గర్వించేలా కృషి చేస్తాను. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను" అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News