Dhulipala Narendra Kumar: పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి నాపై ఈసీకి ఫిర్యాదు చేశారు: ధూళిపాళ్ల

Dhulipalla says Ponnur YSRCP candidate Ambati Murali has complained against him
  • రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం అన్న ధూళిపాళ్ల
  • ఓటమి ఖాయం కావడంతో వైసీపీ అభ్యర్థులు చిల్లర పనులు చేస్తున్నారని విమర్శలు
  • సంగం డెయిరీ చైర్మన్ గా తనను తొలగించాలంటున్నారని వెల్లడి
రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమిదే విజయం అని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఓటమి ఖాయమని తేలడంతో వైసీపీ అభ్యర్థులు చిల్లర కార్యక్రమాలకు తెరలేపారని విమర్శించారు. 

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళి నాపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు అని ధూళిపాళ్ల వెల్లడించారు. సంగం డెయిరీ చైర్మన్, డీవీసీ ఆసుపత్రి డైరెక్టర్ పదవుల నుంచి నన్ను తొలగించాలని కోరారు అని వివరించారు. ప్రభుత్వ డబ్బులు లేని సంగం డెయిరీకి, ఎన్నికలకు సంబంధం ఏమిటని ధూళిపాళ్ల ప్రశ్నించారు. కంపెనీ చట్టం కింద కార్యకలాపాలు కొనసాగిస్తున్న సంగం డెయిరీకి ఆర్వో ఎలా వస్తారని నిలదీశారు. 

అధికారంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నో దందాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అయోధ్య రామిరెడ్డి రాంకీ ఉద్యోగుల ద్వారా డబ్బు పంపిణీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. రాంకీ కంపెనీ మీద కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కిలారి రోశయ్య వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని ధూళిపాళ్ల పేర్కొన్నారు. సీఎంను, మంత్రులను తొలగిస్తేనే ఎన్నికలు నిష్పాక్షికంగా జరుగుతాయని స్పష్టం చేశారు.
Dhulipala Narendra Kumar
AMbati Murali
Ponnur
TDP
YSRCP
Sangam Dairy

More Telugu News