IndiGo: నా సూట్‌కేసును ధ్వంసం చేసినందుకు థ్యాంక్స్.. ఇండిగోపై ప్రయాణికురాలి వేదనాభరిత పోస్ట్ వైరల్

 IndiGo passenger shares sarcastic post of damaged luggage went viral
  • తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న ఇండిగో
  • బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణించిన మహిళ
  • విరిగిన సూట్‌కేసు అప్పగించినందుకు గుస్సా
  • సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్
  • క్షమించమన్న విమానయాన సంస్థ
చవక ధరల విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల తరచుగా వివాదాల్లో చిక్కుకుంటోంది. సీటు కుషన్లు మాయం కావడం దగ్గరి నుంచి శాండ్‌విచ్‌లో స్క్రూ లభించడం వంటి ఘటనలను ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి ప్రయాణించిన శ్రంకల శ్రీవాస్తవ  అనే మహిళ విరిగిపోయిన తన సూట్‌కేస్‌ను ఎక్స్‌లో పోస్టు చేస్తూ.. ‘‘డియర్ ఇండిగో నా లగేజీపై శ్రద్ధ తీసుకున్నందుకు కృతజ్ఞతలు’’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
    ఇండిగో క్షమాపణలు
శ్రీవాస్తవ పోస్టు కాస్తా వైరల్ కావడంతో ఇండిగో దిగొచ్చింది. ఆమెకు క్షమాపణ చెబుతూనే, అసౌకర్యానికి చింతిస్తున్నామని, చెక్ చేసుకునేందుకు తమకు కొంత సమయం కావాలని, మీతో టచ్‌లోకి వస్తామని పేర్కొంది. ఈ పోస్టులపై మరికొందరు రియాక్టయ్యారు. ఇండిగో ప్రయాణంలో గతంలో తమకు ఎదురైన అనుభవాలను ఏకరువు పెడుతూ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
IndiGo
Damaged Luggage
Bengaluru
Delhi
Social Media
viral Post

More Telugu News