Sunrisers vs Mumbai Indians: సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో బద్దలైన రికార్డులు ఇవే

These are the records broken in Sunrisers vs Mumbai Indians IPL match
  • ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు -277ను నమోదు చేసిన సన్‌రైజర్స్
  • సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 246 రికార్డు నమోదు చేసిన ముంబై ఇండియన్స్
  • ఒకే మ్యాచ్‌లో నమోదయిన 523 పరుగులతో సరికొత్త రికార్డు
  • బుధవారం రాత్రి రికార్డుల మ్యాచ్‌కు వేదికైన ఉప్పల్ క్రికెట్ స్టేడియం
హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా బుధవారం రాత్రి సన్‌రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. సిక్సులు, ఫోర్లతో మైదానం మోతెక్కింది. ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన అతిథ్య సన్‌రైజర్స్ జట్టు విధ్వంసం సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ కూడా ‘తగ్గేదేలా’ అనేట్టుగా బ్యాటింగ్ ఆరంభించింది. చివరికి 31 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైనప్పటకీ ఈ ‘హై స్కోరింగ్’ మ్యాచ్‌‌లో పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి.

సన్‌రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో బద్దలైన రికార్డులివే..
  • ఒక మ్యాచ్‌లో రెండు జట్ల మొత్తం స్కోరు 500 దాటడం ఇదే తొలిసారి. మొత్తం 523 పరుగుల నమోదు.
  • 2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్ల మొత్తం స్కోరు 517 పరుగులు ఇప్పుడు రెండవ స్థానానికి పడిపోయింది
  • పురుషుల టీ20 లీగ్‌లు, ఐపీఎల్‌ టోర్నీలో ఇదే (523) అత్యధిక స్కోరు
  • ఐపీఎల్‌లో 2010 సీజన్‌లో చెన్నై, రాజస్థాన్‌ జట్లు మొత్తం 469 పరుగులు ఇప్పటివరకు టాప్ స్కోరుగా ఉండేది. అది ఇప్పుడు బ్రేక్ అయ్యింది.
  • ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు -277 నమోదు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌
  • సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అత్యధిక పరుగులుగా నిలిచిన ముంబై ఇండియన్స్ - 246 స్కోరు
  • ఈ మ్యాచ్‌లో మొత్తం మొత్తం సిక్స్‌లు, ఫోర్ల సంఖ్య 69
  • 2010లో చెన్నై, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 69 బౌండరీలు నమోదయాయి.
  • ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు - 38 నమోదు
  • పురుషుల టీ20 టోర్నీలో అత్యధిక సిక్సర్లు నమోదయిన మ్యాచ్‌ ఇదే
  • సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు కొట్టిన సిక్సర్ల సంఖ్య 20గా ఉంది. అంతకంటే ముందు 2013లో రాయల్ ఛాలంజర్స్ బెంగళూరు జట్టు ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 21 సిక్సర్లు బాదింది.
Sunrisers vs Mumbai Indians
IPL 2024
Cricket
Hyderabad

More Telugu News