Sadguru: ఇంద్రప్రస్థ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సద్గురు వాసుదేవ్

Sadhguru Jaggi Vasudev leaves from Indraprastha Apollo Hospitals
  • సద్గురు మెదడులో గడ్డ కట్టిన రక్తం
  • ఈ నెల 17న ఆసుపత్రిలో చేరిన సద్గురు
  • అత్యవసర శస్త్ర చికిత్స చేసిన వైద్యులు

ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయన ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ కావడంతో ఆయన ఈ నెల 17న ఆసుపత్రిలో చేరారు. వాస్తవానికి ఆయన కొన్ని వారాల ముందు నుంచే తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. అయితే శివరాత్రి కార్యక్రమాల కారణంగా ఆయన ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. మార్చి 15న ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తే... రక్తం గడ్డ కట్టినట్టు తేలిందని ఈషా ఫౌండేషన్ తెలిపింది. రక్తస్రావం వల్ల ఆయన తీవ్రమైన తలనొప్పికి గురయ్యారు. ఇంద్రప్రస్థ ఆసుపత్రిలో ఆయనను అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ తర్వాత ఆయన ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డారు. ప్రాణాపాయ స్థితి నుంచి సద్గురు బయటపడ్డారని వైద్యులు తెలిపారు. 

  • Loading...

More Telugu News