Konda Surekha: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు: మంత్రి కొండా సురేఖ

Konda Surekha fires at Phone Tapping
  • సీఎం కూతురుగా ఉన్నప్పుడు మద్యం అక్రమ వ్యాపారం చేశారని ఆరోపణ
  • అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగెత్తారని విమర్శ
  • కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని ఆరోపణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని, తన భర్త కొండా మురళి ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేశారని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు. తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కవిత మద్యం అక్రమ వ్యాపారం చేశారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందన్నారు. కాళేశ్వరం అవినీతిలో బీజేపీకి వాటా ఉందని, మేఘా కృష్ణారెడ్డి బీజేపీకి వెయ్యి కోట్ల రూపాయలను పార్టీ ఫండ్‌గా ఇచ్చారని ఆరోపించారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఆ పార్టీ నోరు మెదపడం లేదన్నారు.
Konda Surekha
Congress
Phone Tapping Case
Telangana

More Telugu News