Barrelakka Marriage: బ‌ర్రెల‌క్క ఇంట పెళ్లి సంద‌డి.. ఇదిగో వీడియో !

Barrelakka Wedding Celebrations Video goes Viral on Social Media
  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ చేసిన బ‌ర్రెల‌క్క
  • ఇప్పుడు మ‌రోసారి త‌న పెళ్లి కార‌ణంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌
  • 'పెళ్లి పిల్ల‌ను చేస్తున్నారు' అనే క్యాప్ష‌న్‌తో తాజాగా ఇన్‌స్టాలో వీడియో పెట్టిన బ‌ర్రెల‌క్క‌ 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో నెట్టింట బాగా హ‌ల్‌చ‌ల్ చేసిన పేరు బ‌ర్రెల‌క్క అలియాస్ క‌ర్నె శిరీష‌. నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా కొత్త‌ప‌ల్లి మండ‌లం మ‌రిక‌ల్ గ్రామానికి చెందిన క‌ర్నె శిరీష అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె పేరు ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో మార్మోగిపోయింది. 

ఇప్పుడు మ‌రోసారి త‌న పెళ్లి కార‌ణంగా బ‌ర్రెల‌క్క నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇప్ప‌టికే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ నెల 28న వివాహబంధంలోకి అడుగుపెట్ట‌నున్న‌ట్లు ఆమె తెలియ‌జేసింది. కాబోయే భ‌ర్త‌ను ప‌రిచ‌యం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా విడుద‌ల చేసింది. 

ఇప్పుడు ఇవాళ్టి నుంచే త‌న ఇంట పెళ్లి సంద‌డి మొద‌లైన‌ట్లు బ‌ర్రెల‌క్క మ‌రోక‌ వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మొద‌టి రోజు హ‌ల్దీ వేడుక‌లో భాగంగా ఆమె పెళ్లి కూతురిగా ముస్తాబు కావ‌డం వీడియోలో ఉంది. 'పెళ్లి పిల్ల‌ను చేస్తున్నారు' అనే క్యాప్ష‌న్‌తో ఆమె ఈ వీడియోను పోస్ట్ చేయ‌డం జ‌రిగింది. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.
Barrelakka Marriage
Viral Videos
Social Media
Telangana

More Telugu News