Harish Rao PA Arrest: సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసులో ఓ వ్యక్తి అరెస్ట్

Former Minister Harish Rao PA Naresh Kumar Arrest
  • సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం కేసు
  • మెదక్ జిల్లా వాసి ఫిర్యాదుతో కేసు నమోదు
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు వద్ద గతంలో పనిచేసిన నరేశ్ కుమార్ అనే వ్యక్తిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం నాడు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల దుర్వినియోగం కేసులో నరేశ్ కుమార్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, అనర్హులకు చెక్కులు అందించారని మెదక్ జిల్లా నారాయణఖేడ్ కు చెందిన రవినాయక్ ఫిర్యాదు చేశారు. తనకు మంజూరైన రూ.5 లక్షల చెక్కును నరేశ్ కుమార్ కాజేశాడని ఆరోపించాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణ తర్వాత నరేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ హయాంలో హరీశ్ రావు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆఫీసులో నరేశ్ కుమార్, మరో ముగ్గురు సీఆర్ఎంఎఫ్ విభాగంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేశారు. ఈ క్రమంలోనే చెక్కుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రాథమికంగా ఆధారాలు లభించినట్లు సమాచారం. రవినాయక్ కు చెందిన రూ.5 లక్షల చెక్కును క్యాష్ చేసుకుని నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్ లు పంచుకున్నట్టు భావిస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో వారి దగ్గర మరికొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు దొరికినట్లు సమాచారం.
Harish Rao PA Arrest
CMRF Cheque
CMRF miss use
Harish Rao office

More Telugu News