Ramcharan: బిడ్డ పుట్టిన తరువాత తొలిసారిగా తిరుమలకు రామ్‌చరణ్ దంపతులు

Ram Charan couple visits Tirumala temple with their baby
  • తన పుట్టినరోజు సందర్భంగా భార్యాబిడ్డలతో తిరుమలకు వెళ్లిన రామ్‌చరణ్
  • సుప్రభాత సేవలో పాల్గొన్న వైనం
  • బిడ్డ పుట్టిన తరువాత తొలిసారిగా కుటుంబంతో శ్రీవారి దర్శనం
బిడ్డ పుట్టిన తరువాత తొలిసారిగా రామ్ చరణ్ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని అత్తామామలు, భార్యాబిడ్డలతో కలిసి ఆయన తిరుమలకు వచ్చారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. మరోవైపు, రామ్‌చరణ్‌ను పలకరించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన రామ్‌చరణ్‌ దంపతులను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
 
Ramcharan
Tirumala
Tollywood

More Telugu News