Arvind Kejriwal: కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఈడీ కార్యాలయానికి భార్య సునీత

Sunita Kejriwal reaches the ED office to meet him
  • ములాఖత్ సమయంలో భర్తను కలిసిన సునీత  
  • తన అరెస్ట్‌ను హైకోర్టులో సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్
  • రేపు విచారించనున్న ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన భార్య సునీత ఈడీ కార్యాలయానికి వచ్చారు. ములాఖత్ సమయంలో ఆమె భర్తను కలిశారు. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా ఈడీ కస్టడీకి అప్పగించింది. దీంతో ఆయనను ఈడీ కార్యాలయంలోనే ఉంచి విచారిస్తున్నారు.

మరోవైపు, మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రేపు విచారించనుంది. ఉదయం పదిన్నర గంటలకు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ వ్యాజ్యాన్ని విచారించనున్నారు.
Arvind Kejriwal
AAP
ED
Delhi Liquor Scam

More Telugu News