Chandrababu: ఏ హీరో కూడా ఇంత యాక్టింగ్ చేసి ఉండడు: చంద్రబాబు

Chandrababu satires on CM Jagan over Handri Neeva water release fiasco
  • కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు
  • రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించిన చంద్రబాబు
  • ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సెట్టింగ్ వేయించి ఉండడని ఎద్దేవా
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రాజుపేట వద్ద హంద్రీనీవా కాలువను పరిశీలించి ఆశ్చర్యపోయారు. గత నెలలో సీఎం జగన్ హంద్రీనీవా నీళ్లు విడుదల చేసిన ఘట్టం ఓ సినిమా చిత్రీకరణను మించిపోయిందని అన్నారు. 

"ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి సెట్టింగ్ వేయించి ఉండడు. ఏ హీరో కూడా ఇంత యాక్టింగ్ చేసి ఉండడు. ఒక గేటు, దాని పక్కన ఒక బటన్, గేటు వెనకాల ట్యాంకర్లతో తెచ్చి పోసిన నీళ్లు! జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు, హంద్రీనీవా నీళ్లు అన్నాడు, పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు. బటన్ నొక్కి, ఫొటోలు దిగి వెళ్లిపోయాడు. కట్ చేస్తే... కాలువలో నీళ్లు ఇంకిపోయాయి. సాయంత్రమే అధికారులు వచ్చి గేట్లు తీసుకుపోయారు... ఇదీ కథ" అంటూ చంద్రబాబు వివరించారు.
Chandrababu
Handri Neeva
Jagan
TDP
YSRCP

More Telugu News