Nara Lokesh: జగ్గూభాయ్ కళ్లలో ఆనందం కోసం టీడీపీ నేతపై గన్ ఎత్తిన సీఐ చిన్న మల్లయ్యను వెంటనే సస్పెండ్ చేయాలి: నారా లోకేశ్

Nara Lokesh demands suspension on Karampudi CI Chinna Mallaiah
  • కారంపూడి సీఐని సస్పెండ్ చేయాలన్న లోకేశ్
  • ఎన్నికల సంఘం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • ఎక్స్ లో వీడియో పంచుకున్న టీడీపీ అగ్రనేత

పల్నాడు జిల్లా కారంపూడి సీఐ చిన్న మల్లయ్య టీడీపీ నేతకు గన్ గురిపెట్టాడంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. జగ్గూభాయ్ కళ్లలో ఆనందం కోసం సన్నగండ్ల టీడీపీ నేత చప్పిడి రాముపై గన్ ఎత్తిన సీఐ చిన్న మల్లయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాకీల గూండాయిజంపై ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

"కారంపూడి సీఐ చిన్న మల్లయ్య గారూ... వైసీపీ ప్యాకేజి మత్తులో మీకు తెలియడంలేదు కానీ, మీ జగ్గూభాయ్ సీను ఎప్పుడో కాలిపోయింది. ఇదేమన్నా పోకిరీ సినిమా అనుకుంటున్నారా... సర్వీస్ రివాల్వర్ గురిపెడుతున్నారు?" అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా లోకేశ్ ఎక్స్ లో పంచుకున్నారు.

  • Loading...

More Telugu News