Naveen Chandra: అడవిలో హత్యలకు దెయ్యమే కారణమా?: ఉత్కంఠను పెంచుతున్న 'ఇన్ స్పెక్టర్ రిషి' సిరీస్

Inspector RishiWeb Series Update
  • నవీన్ చంద్ర హీరోగా 'ఇన్ స్పెక్టర్ రిషి'
  • హారర్ టచ్ తో నడిచే క్రైమ్ థ్రిల్లర్
  • అడవి నేపథ్యంలో నడిచే కథ 
  • ఈ నెల 29 నుంచి  అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్

ఒక వైపున సినిమాలు చేస్తూనే మరో వైపున వెబ్ సిరీస్ లతో నవీన్ చంద్ర బిజీగా ఉన్నాడు. ఆయన నుంచి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో సిరీస్ రెడీ అవుతోంది. ఆ సిరీస్ పేరే 'ఇన్ స్పెక్టర్ రిషి'. ఈ సిరీస్ లో టైటిల్ రోల్ లో నవీన్ చంద్ర కనిపించనున్నాడు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ సిరీస్ కి, నందిని దర్శకత్వం వహించారు. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ ను ఈ నెల 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సిరీస్ ను అందుబాటులోకి తెస్తున్నారు. ఒక వైపున హారర్ థ్రిల్లర్ .. మరో వైపున సూపర్ నేచురల్ థ్రిల్లర్ కలిసిన ఒక విలక్షణమైన జోనర్ ఇది. సీబీ  సీఐడీ ఆఫీసర్ గా నవీన్ చంద్ర నటించిన ఈ సిరీస్ లో, సునైన .. కన్నారవి .. శ్రీకృష్ణ దయాళ్ .. జీవరత్నం .. కుమార్ వేల్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

ఒక అటవీప్రాంతంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ కేసు విషయంపై ఆ ప్రాంతానికి ఇన్ స్పెక్టర్ రిషి వస్తాడు. అడవిలో తిరుగుతున్న ఒక దెయ్యం ఈ హత్యలకు కారణమని అక్కడి గిరిజనులు చెబుతారు. వాళ్ల మాటల్లో నిజం లేదని భావించిన రిషి, తన టీమ్ తో కలిసి అడవిలోకి వెళతాడు. అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనేదే కథ.

  • Loading...

More Telugu News