Manikandan: హాట్ స్టార్ ఫ్లాట్ ఫామ్ పైకి సక్సెస్ ఫుల్ లవ్ స్టోరీ!

  • తమిళంలో హిట్ కొట్టిన 'ట్రూ లవర్'
  • ఇక్కడి థియేటర్స్ నుంచి కనిపించని రెస్పాన్స్ 
  • రేపటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
  • ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్    

True Lover Movie Update

కోలీవుడ్ లో హీరోగా మణికందన్ కి మంచి గుర్తింపు ఉంది. ఇంతకుముందు ఆయన చేసిన 'గుడ్ నైట్' సినిమాకి ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా ఆయన ఇమేజ్ ను కూడా పెంచింది. అలాంటి మణికందన్ హీరోగా రూపొందిన 'లవర్' సినిమా ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

తమిళంలో ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా, మంచి లాభాలను తెచ్చి పెట్టింది. మారుతి - ఎస్ కె ఎన్ కలిసి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ట్రూ లవర్' పేరుతో తీసుకొచ్చారు. గౌరీప్రియ కథానాయికగా నటించిన ఈ సినిమాను, తెలుగు ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. అలాంటి ఈ సినిమా రేపటి నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. 

పెళ్లి అనేది ఒక నమ్మకం .. అయితే ప్రేమ అనేది పెళ్లివరకూ వెళ్లాలంటే కావలసింది కూడా నమ్మకమే అని సందేశాన్ని ఇచ్చే సినిమా ఇది. ప్రేమ - అనుమానం అనే రెండు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో నుంచి ఆడియన్స్ కి కావలసిన వినోదం పుడుతుంది. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

More Telugu News