IPL 2024: హైద‌రాబాద్‌లో దిగిన ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు

Mumbai Indians Squad Arrives in Hyderabad Ahead of IPL 2024 Clash Against Sunrisers Hyderabad
  • రేప‌టి (బుధ‌వారం) మ్యాచులో త‌ల‌ప‌డ‌నున్న‌ ముంబై, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ 
  • ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్‌
  • ఈ సీజ‌న్‌లో తాము ఆడిన‌ తొలి మ్యాచుల్లోనే ఓడిన ఇరు జ‌ట్లు
ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) జ‌ట్టు సభ్యులు సోమ‌వారం ఘ‌నంగా హోలీ వేడుక‌లు జరుపుకున్నారు. దాని తాలూకు వీడియోను ముంబై ఫ్రాంచైజీ అభిమానుల‌తో పంచుకుంది. ఇక హోలీ వేడుక‌ల అనంత‌రం ఆ జ‌ట్టు త‌న త‌ర్వాతి మ్యాచ్ కోసం తాజాగా హైద‌రాబాద్‌లో దిగింది. త‌మ ఆట‌గాళ్లు హైద‌రాబాద్ చేరిన స‌మ‌యంలో తీసిన‌ వీడియోను కూడా ఫ్రాంచైజీ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌ చేసింది. బుధ‌వారం (మార్చి 27న‌) ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో ఎంఐ త‌ల‌ప‌డ‌నుంది.

ఇదిలావుంటే.. ముంబై ఇండియ‌న్స్‌, హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌మ తొలి మ్యాచుల్లో ఓట‌మి చవిచూసిన విష‌యం తెలిసిందే. తొలిసారి ఎంఐ ప‌గ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యాకు మొద‌టి మ్యాచులోనే ప‌రాజ‌యం ఎదురైంది. గుజ‌రాత్ చేతిలో ముంబై గెలుపు ముంగిట వ‌ర‌కు వ‌చ్చి ఓడిపోవ‌డం అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. అటు ఎస్ఆర్‌హెచ్ కూడా ఈ సీజ‌న్‌లో ఆడిన తొలి మ్యాచులో ప‌రాజ‌యం పాలైంది. హైద‌రాబాద్ జ‌ట్టును మొద‌టి మ్యాచులో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) మ‌ట్టిక‌రిపించింది. చివ‌ర‌లో కెప్టెన్ పాట్ క‌మిన్స్ ఒక భారీ షాట్ ఆడ‌క‌పోవ‌డంతో ప‌రాభవం త‌ప్ప‌లేదు. ఇలా రెండు జ‌ట్లు త‌మ తొలి మ్యాచుల్లో ఓట‌మితో ఈ సీజ‌న్‌ను ప్రారంభించాయి. దాంతో త‌మ త‌ర్వాతి మ్యాచులో ఎలాగైనా గెల‌వాల‌నే క‌సితో బ‌రిలోకి దిగ‌బోతున్నాయి.
IPL 2024
Mumbai Indians
Sunrisers Hyderabad
Hyderabad
Cricket
Sports News

More Telugu News