హీరో నానీని కలిసిన బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్
- తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్
- హైదరాబాద్ లోని నానీ నివాసానికి వచ్చిన ఓవెన్
- నానీతో పలు అంశాలపై చర్చ
"నానీని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. నానీ సినీ, వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమతో బ్రిటన్ సంబంధాలు ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అనే అంశంపైనా చర్చించాను. ఈ సందర్భంగా, తాను నటించిన రెండు సినిమాలు చూడమని నాని నాకు సూచించారు. మరి నేచురల్ స్టార్ నటించిన ఏ సినిమాలు చూడాలో నాకు కాస్త చెబుతారా?" అంటూ గారెత్ విన్ ఓవెన్ నెటిజన్లను కోరారు.