Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సీడీపీ వచ్చేసింది!

Global Star Ram Charan birthday CDP released
  • ఈ నెల 27న రామ్ చరణ్ పుట్టినరోజు
  • ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్
  • స్పెషల్ గా డిజైన్ చేసిన సీడీపీని పంచుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మార్చి 27న పుట్టినరోజు జరుపుకోనున్నారు. అభిమానులు కొన్ని రోజుల ముందు నుంచే వేడుకలకు తెరలేపారు. తాజాగా, రామ్ చరణ్ బర్త్ డే సీడీపీ (కామన్ డిస్ ప్లే పిక్చర్) విడుదలైంది. 

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. రామ్ చరణ్ పుట్టినరోజు నేపథ్యంలో,  "హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్" అంటూ గేమ్ చేంజర్ స్టిల్ తో కూడిన స్పెషల్ సీడీపీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియాలో ఆవిష్కరించింది. 

"గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా" అంటూ రామ్ చరణ్ ను అభివర్ణించింది. "నటనపై అంకితభావం, తపన, కఠోర శ్రమతో మెగా వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ఘనంగా చాటుతున్న రామ్ చరణ్ ఇవాళ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు" అని కొనియాడింది.

  • Loading...

More Telugu News