Budda Venkanna: లోకేశ్ ను ఓడించడానికి రూ. 500 కోట్లు దాచారు: బుద్దా వెంకన్న

YSRCP spending 500 Cr to defeat Nara Lokesh says Budda Venkanna
  • మంగళగిరిలో ఒక్కో ఓటుకు రూ. 30 వేలైనా పంచేందుకు సిద్ధమయ్యారన్న వెంకన్న
  • సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపణ
  • డీజీపీని తప్పించాలని ఈసీకి లేఖ రాస్తామన్న వెంకన్న
మంగళగిరిలో నారా లోకేశ్ ను ఓడించడానికి రూ. 500 కోట్లు దాచారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. లోకేశ్ ను ఓడించడానికి ఒక్కో ఓటుకు రూ. 30 వేలైనా పంచేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. లోకేశ్ అంటే వైసీపీ ప్రభుత్వానికి భయమని... అందుకే ఆయన వాహనాన్ని అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీస్ ఎస్కార్ట్ తో సాక్షి వాహనాల్లో రాష్ట్రమంతటా డబ్బును పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రజల నుంచి దోచుకున్న డబ్బును ఇప్పుడు జగన్ పంచుతున్నారని అన్నారు. వైసీపీ వాళ్లు ఇచ్చిన డబ్బును తీసుకుని ఓటు మాత్రం టీడీపీకి వేయాలని కోరారు. 

ఎన్నికల కోడ్ వచ్చినా పోలీసు శాఖ భయం లేకుండా వైసీపీకి సపోర్ట్ చేస్తోందని బుద్దా మండిపడ్డారు. డీజీపీని తప్పించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని చెప్పారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనకున్న వారిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

Budda Venkanna
Nara Lokesh
Telugudesam
Mangalagiri
Jagan
YSRCP

More Telugu News