Chandrababu: కుప్పం చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu offers special prayers at Kothapeta Kanyaka Parameswari temple
  • ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
  • రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారం
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చేరుకున్నారు. ఇవాళ, రేపు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు... ఎల్లుండి (మార్చి 27) రాష్ట్ర వ్యాప్త ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, చంద్రబాబు ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి కుప్పం వచ్చారు. ఆయనకు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు తన పర్యటన సందర్భంగా కొత్తపేట కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం, ఆయన కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
Chandrababu
Kuppam
TDP
Chittoor District
TDP-JanaSena-BJP Alliance

More Telugu News