BRS: హైదరాబాద్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్.. అభ్యర్థుల ఎంపిక పూర్తి
- ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
- తాజాగా హైదరాబాద్ స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారు
- ఇంకా ప్రకటనలకే పరిమితమైన కాంగ్రెస్, బీజేపీ
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తిచేసింది. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీని దాటేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్, బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండి కొన్ని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండగా కేసీఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
| ఆదిలాబాద్ | ఆత్రం సక్కు |
| మల్కాజిగిరి | రాగిడి లక్ష్మారెడ్డి |
| ఖమ్మం | నామా నాగేశ్వర్‌రావు |
| మహబూబాబాద్ | మాలోత్ కవిత |
| కరీంనగర్ | బోయినపల్లి వినోద్‌కుమార్ |
| పెద్దపల్లి | కొప్పుల ఈశ్వర్ |
| మహబూబ్‌నగర్ | మన్నె శ్రీనివాస్‌రెడ్డి |
| చేవెళ్ల | కాసాని జ్ఞానేశ్వర్ |
| వరంగల్ | కడియం కావ్య |
| జహీరాబాద్ | గాలి అనిల్‌కుమార్ |
| నిజామాబాద్ | బాజిరెడ్డి గోవర్ధన్ |
| సికింద్రాబాద్ | పద్మారావుగౌడ్ |
| నాగర్‌కర్నూల్ | ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ |
| భువనగిరి | క్యామ మల్లేశ్ |
| నల్లగొండ | కంచర్ల కృష్ణారెడ్డి |
| మెదక్ | వెంకట్రామిరెడ్డి |
| హైదరాబాద్ | గడ్డం శ్రీనివాస్ యాదవ్ |