Nara Lokesh: పోలీసు నియామకాలపై నారా లోకేశ్ స్పష్టమైన హామీ

TDP leader Nara Lokesh Assures To Recruit Police Jobs
  • ఎన్నికల నేపథ్యంలో వివిధ వర్గాలతో తరచూ భేటీ అవుతున్న లోకేశ్
  • తాడేపల్లిలోని పైన్ ఉడ్ అపార్ట్‌మెంట్ వాసులతో నేడు భేటీ
  • పోలీసు నియామకాలను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే పోలీసుల నియామకాలు చేపడతామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్ వాసులతో సమావేశమవుతున్న లోకేశ్.. నేడు పైన్ ఉడ్ అపార్ట్‌మెంట్ ప్రజలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసు నియామకాలు చేపడతామని తెలిపారు. పోలీసు నియామకాలన్నీ పూర్తి పాదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో లోకేశ్‌తోపాటు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. 

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలతో విస్తృతంగా మమేకమవుతూ, వివిధ వర్గాలతో భేటీ అవుతున్న లోకేశ్ నిన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆటో కార్మికులు, ఏసీ మెకానిక్‌లతో భేటీ అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆటోనగర్ స్థలాలను కబ్జా చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 5, 6ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లపై పన్ను భారం తగ్గించడంతో పాటు వారి ఆదాయం పెరిగేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఏసీ మెకానిక్‌లకు అవసరమైన నైపుణ్య శిక్షణ, పనిముట్లు అందజేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News