Joginapalli Santosh: బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై కేసు నమోదు

Police case files on BRS former MP Joginapalli Santosh Kumar
  • సంతోష్ కుమార్ పై భూ కబ్జా ఆరోపణలు
  • బంజారాహిల్స్ రోడ్ నెం.14లో స్థలంపై కన్నేశారని ఫిర్యాదు
  • తప్పుడు పత్రాలు సృష్టించి కబ్జాకు యత్నించారని ఆరోపణ
  • పలు సెక్షన్లతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు

బీఆర్ఎస్ మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ చిక్కుల్లోపడ్డారు. హైదరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లో సంతోష్ కుమార్ కబ్జాకు పాల్పడుతున్నాడన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

సంతోష్ కుమార్ పై నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవయుగ సంస్థ బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని సర్వే నెం.129/54లో 1,350 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసింది. 

అయితే, నకిలీ పత్రాలు సృష్టించి ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ జోగినపల్లి సంతోష్ కుమార్, లింగారెడ్డి శ్రీధర్ లపై నవయుగ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు నేపథ్యంలో, సంతోష్ కుమార్, శ్రీధర్ లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News