Kaushik Reddy: ఏడో గ్యారెంటీ పొన్నం ప్రభాకర్ ఆవేశం: కౌశిక్ రెడ్డి

Kaushik Reddy calls Ponnam Prabhakar as Avesham Star
  • అధికారిక కార్యక్రమాల్లో తమను భాగస్వామిని చేయనీయడం లేదని మండిపాటు
  • పొన్నంను ఆవేశం స్టార్ అని పిలవాలని ఉందని వ్యాఖ్య
  • ప్రొటోకాల్ ఉల్లంఘించే అధికారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరిక

మంత్రి పొన్నం ప్రభాకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పొన్నం ప్రభాకర్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. అధికార కార్యక్రమంలో తమను భాగస్వామిని చేయొద్దని పొన్నం ప్రభాకర్ ఎలా అంటారని ప్రశ్నించారు ఆర్డీఓకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న పొన్నంను ఎందుకు బర్తరఫ్ చేయొద్దని ఆయన ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆయనను 'ఆవేశం స్టార్' అని పిలవాలని ఉందని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు తోడు ఏడో గ్యారెంటీ పొన్నం ప్రభాకర్ ఆవేశమని ఎద్దేవా చేశారు. 

ఇలాంటి పనులు చేసినందుకే కరీంనగర్ ప్రజలు తన్ని తరిమేశారని... దీంతో పొన్నం ఎక్కడికో పారిపోయారని కౌశిక్ రెడ్డి అన్నారు. అధికారులు కూడా నిబంధనలను పాటించాలని... ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. పొన్నం మాటలు వింటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు అవుతుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News