Deepinder Goyal: మెక్సికన్ మాజీ మోడల్ ను పెళ్లాడిన జొమాటో సీఈవో దీపిందర్ గోయల్

Zomato CEO Deepinder Goyal married Mexican former model Grecia Munoz
  • రెండో పెళ్లి చేసుకున్న దీపిందర్ గోయల్
  • గ్రేసియా మున్యోజ్ ను వివాహం చేసుకున్న వైనం
  • గత ఫిబ్రవరిలో హనీమూన్
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ (41) ఓ విదేశీ భామను పెళ్లాడారు. ఆయన ఓ మెక్సికన్ మాజీ మోడల్, మహిళా వ్యాపారవేత్త గ్రేసియా మున్యోజ్ ను వివాహం చేసుకున్నారు. జొమాటో సీఈవో దీపిందర్ గోయల్, గ్రేసియాల వివాహం చాలారోజుల కిందటే జరిగిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అంతేకాదు, వీరిద్దరూ గత ఫిబ్రవరిలోనే హనీమూన్ కు కూడా వెళ్లొచ్చారట. 

దీనిపై గ్రేసియా తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ లో నా ఇంట్లో ఉన్నాను అని పేర్కొన్నారు. 

గ్రేసియా గతంలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు. 2022లో అమెరికాలో నిర్వహించిన మెట్రోపాలిటన్ ఫ్యాషన్ వీక్ లో విజేతగా నిలిచారు. గ్రేసియా ప్రస్తుతం ఓ లగ్జరీ ఉపకరణాల స్టార్టప్ ను నడిపిస్తున్నారు.  

ఆమె ఈ ఏడాది జనవరిలోనే భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలో తాను సందర్శించిన ప్రదేశాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

కాగా, జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ కు ఇది రెండో పెళ్లి. ఆయన గతంలో ఐఐటీ ఢిల్లీలో తన సహాధ్యాయి కాంచన్ జోషిని పెళ్లాడారు.
Deepinder Goyal
Zomato
Grecia Munoz
Mexico
Former Model

More Telugu News