Bridge Collapsed: బీహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఒకరి మృతి.. వీడియో ఇదిగో

Several trapped and one dead as under construction bridge collapses in Bihar
  • కోసి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన
  • ఒక్కసారిగా కూలిన శ్లాబ్
  • శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కార్మికులు
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
బీహార్‌లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. సుపౌల్‌లో జరిగిందీ ఘటన. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు కూలీలను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కోసి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి శ్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరిలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Bridge Collapsed
Bihar
Supaul
Kosi river

More Telugu News