DJ Axwell: రేపు ఐపీఎల్-2024 ప్రారంభం... మ్యాచ్ మధ్యలో స్వీడన్ డీజే ఆక్స్ వెల్ ప్రదర్శన

Sweden DJ Axwell will perform mid innings show in IPL inauguration match
  • ఐపీఎల్ 17వ సీజన్ కు సర్వం సిద్ధం
  • తొలి మ్యాచ్ లో సీఎస్కేతో తలపడనున్న ఆర్సీబీ
  • ఓపెనింగ్ సెర్మనీలో సందడి చేయనున్న అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్
  • గానమాధుర్యంతో ఉర్రూతలూగించనున్న ఏఆర్ రెహమాన్, సోను నిగమ్

ఐపీఎల్-2024 సీజన్ కు సర్వం సిద్ధమైంది. రేపు (మార్చి 22) చెన్నైలోని చిదంబరం స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే ఈ పోరులో ఇన్నింగ్స్ మధ్యలో సంగీత కచేరి ఏర్పాటు చేశారు. స్వీడన్ కు చెందిన ప్రముఖ డీజే, రికార్డ్ ప్రొడ్యూసర్, రీమిక్స్ స్పెషలిస్ట్ ఆక్స్ వెల్ తన ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. 

ఇక, మ్యాచ్ కు ముందు ఓపెనింగ్ సెర్మనీలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఏఆర్ రెహమాన్, సోను నిగమ్ ఆడిపాడనున్నారు. రేపు సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మొదలవుతాయి. స్టార్ స్పోర్ట్స్ చానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు.

  • Loading...

More Telugu News