ramdas athawale: కేంద్ర సహాయమంత్రి రాందాస్ అథవాలేకు తప్పిన ప్రమాదం

Ramdas Athawale meets with road accident in Maharashtra
  • మహారాష్ట్రలోని సతారా జిల్లా వాయి వద్ద ప్రమాదం
  • కంటైనర్‌ను ఢీకొట్టిన కేంద్ర సహాయ మంత్రి కారు
  • ముందు వెళుతున్న కంటైనర్ బ్రేక్ వేయడంతో ఢీకొట్టిన కారు
కేంద్ర సహాయ మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (RPI) నాయకుడు రాందాస్ అథవాలేకు ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా వాయి వద్ద కంటైనర్‌ను కేంద్రమంత్రి కారు ఢీకొట్టింది. ముందు వెళ్తున్న కంటైనర్ సడన్ బ్రేక్ వేయడంతో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని, బీజేపీ అధిష్ఠానంతో చర్చించి షిర్డీ లేదా షోలాపూర్ స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నానని తెలిపారు. బీజేపీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని అప్పుడు చెప్పారు. తన పార్టీకి లోక్ సభలో ఒక్క సభ్యుడు కూడా లేడని... అందుకే తాను పోటీ చేయాలని భావిస్తున్నానని చెప్పారు. మహారాష్ట్రలో బీజేపీ తనకు రెండు సీట్లు కేటాయించవచ్చునని భావిస్తున్నారు.
ramdas athawale
BJP
Maharashtra

More Telugu News