YV Subba Reddy: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: వైవీ సుబ్బారెడ్డి

People have to be careful says YV Subba Reddy
  • మోదీ వస్తే కానీ సభ పెట్టే ధైర్యాన్ని టీడీపీ, జనసేన చేయలేకపోయాయన్న సుబ్బారెడ్డి
  • కూటమి మరోసారి ప్రజల ముందుకు వస్తోందన్న సుబ్బారెడ్డి
  • మరోసారి గడపగడపకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని నేతలకు సూచన
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మరోసారి ప్రజల ముందుకు వస్తోందని... కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సిద్ధం సభలను జగన్ పెట్టిన తర్వాత... బహిరంగ సభ పెట్టుకునే ధైర్యాన్ని టీడీపీ, జనసేనలు చేయలేకపోయాయని చెప్పారు. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ వస్తే కానీ ప్రచారం చేయలేని పరిస్థితిలో టీడీపీ, జనసేన ఉన్నాయని ఎద్దేవా చేశారు. 

పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు వారాహి యాత్రలు చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఎదురైన మోసాలు ప్రజలకు గుర్తున్నాయని చెప్పారు. జగన్ పాలనలో జరిగిన మంచి, కూటమి చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తామని అన్నారు. మరోసారి గడపగడపకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పారు. ఎన్నికల ప్రచారంపై ఉత్తరాంధ్ర నాయకులతో వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
YV Subba Reddy
YSRCP
AP Politics
TDP-JanaSena-BJP Alliance

More Telugu News